Site icon NTV Telugu

Mukhachitram : అతిథిగా విశ్వక్ సేన్… సర్ప్రైజ్ లుక్ రివీల్

Vishwak-Sen

“కలర్ ఫోటో”తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కథా రచయితగా “ముఖచిత్రం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌ని బట్టి చూస్తే విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్‌గా విశ్వామిత్ర అనే పాత్రలో కనిపిస్తాడని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ

చైతన్య రావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ‘హుషారు’ ఫేమ్ ప్రియా వడ్లమాని ద్విపాత్రాభినయం చేస్తోంది. టాక్సీవాలా నిర్మాత SKN సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యాక్షన్ డ్రామా “ముఖచిత్రం”పై ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు సినిమాలో విశ్వక్ కూడా ఉండడం హైప్‌ని పెంచింది.

Exit mobile version