‘ఓరి దేవుడా’ అంటున్న విశ్వక్ సేన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేస్తున్నాయి పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు. మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈ తెలుగు రీమేక్ నూ డైరెక్ట్ చేస్తున్నారు. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు ‘ఓరి దేవుడా’ అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళ సినిమా విపరీతంగా నచ్చేయడంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ దీనికి సంభాషణలు రాశారని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. అతి త్వరలోనే సినిమాను జనం ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు పొట్లూరి ప్రసాద్, దిల్ రాజు. తమిళ మాతృకకు పనిచేసిన ప్రధాన సాంకేతిక నిపుణులే తెలుగు రీమేక్ కూ వర్క్ చేస్తున్నారు. సంగీతాన్ని లియోన్ జేమ్స్ సమకూర్చుతుండగా, విధూ అయ్యన్న సినిమాటోగ్రాఫీ అందిస్తున్నారు. అయితే ఎడిటర్ గా మాత్రం నిర్మాతలు గ్యారీ బిహెచ్ ను ఎంపిక చేసుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!