Vishwak Sen Leg injured while rehearsing for an action sequence of Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు హాట్ బ్యూటి నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామాగా సినిమా ఉండనుందని చెబుతున్న మేకర్స్ ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు మంచి ఆసక్తి పెంచేశారు. ఇక హీరోయిన్ అంజలి కూడా కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించగా ఈ రిలీజ్ విషయంలో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు.
World Cup 2023: ఇండియా కప్ కొడితే బట్టల్లేకుండా బీచ్ వాక్ చేస్తా.. తెలుగు హీరోయిన్ సంచలన ప్రకటన
ఇక అదంతా అలా ఉంచితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా విశ్వక్ సేన్ గాయపడినట్టు తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ చేస్తున్నప్పుడు విశ్వక్ సేన్ కాలికి గాయమైంది, అది కొన్ని రోజుల క్రితం జరిగిందని అతను కొంతకాలం ఆసుపత్రిలో గడిపిన తర్వాత తిరిగి ఇప్పుడు సెట్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ‘డీజే టిల్లు’లో రాధికగా ఆకట్టుకున్న నేహా కమ్ బ్యాక్ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. నేహా మధ్యలో పలు సినిమాల్లో నటించినా కూడా రాధిక లాంటి పాత్ర కోసం మళ్లీ తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి విడుదలైన మొదటి పాటలో చీరకట్టులో మరోసారి తన ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చిన నేహా సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాలో నేహా శెట్టితో పాటు నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.