NTV Telugu Site icon

Vishwak Sen: మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన విశ్వక్ సేన్.. డైరెక్టర్ ఎవరంటే?

Vishwak New Project

Vishwak New Project

Vishwak Sen Announced His New Project Under Krishna Chaitanya Direction: ‘మాస్ కా దాస్’గా యూత్‌లో క్రేజీ ఫాలోయింగ్ పొందిన విశ్వక్ సేప్ ఇప్పుడు జోరు పెంచాడు. ఒకదాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. రీసెంట్‌గానే ‘దాస్ కా ధమ్కీ’తో కమర్షియల్ విజయం సాధించిన ఈ యువ హీరో.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు #VS11 వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ చేశారు. సితారా ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశ్వక్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి ప్రకటించారు.

Meter Trailer: వాడు బాల్ లాంటోడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు

ఇదే సమయంలో కాన్సెప్ట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఏదో స్మగుల్ చేస్తున్న మూడు లారీలు, గోదావరి బ్రిడ్జి, ఒక చీకటి గుహలో పదుల సంఖ్యలో మనుషులు.. మధ్యలో ఒక చోట పడవలో రేడియో డబ్బాను చూపించారు. చూస్తుంటే.. ఇది ఏదో స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈసారి మన మాస్ కా దాస్ బ్యాడ్ అవతారం ఎత్తాడని, గ్రేడ్ షేడ్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా కనిపించనున్నాడంటూ.. విశ్వక్ పాత్ర ఈసారి మరింత వయోలెంట్‌గా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు తనే కథ అందిస్తూ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు అతను రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడి ఇది అతనికి మూడో ప్రాజెక్ట్.

Bellamkonda Srinivas: చరిత్ర సృష్టించిన బెల్లంకొండ.. వరల్డ్ రికార్డ్ సొంతం

ఈ సినిమాకు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. కాన్సెప్ట్ వీడియోకి అతడు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ వీడియో చూస్తే.. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనల్ని హంట్ చేసేలా ఉంటుంది. ఈ వీడియో ద్వారా విశ్వక్‌ని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిత్రబృందం.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలియజేశారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Show comments