NTV Telugu Site icon

Kannappa: ఎట్టకేలకు మంచు విష్ణు జోడీ దొరికేసిందోచ్!

Manchu Vishnu Kannappa

Manchu Vishnu Kannappa

Vishnu Manchu’s ‘Kannappa’ To Feature Model Preity Mukhundhan as Female Lead: మంచు మోహన్ బాబు కుమారుడు, మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు బాలీవుడ్ రామాయణం దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో సినిమా నుంచి తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ను అధికారికంగా ప్రకటిస్తామని ముందే మంచు విష్ణు ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా హీరోయిన్ ను ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఓ మోడల్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు మోడల్‌గా పలు ప్రకటనల్లో కనిపించిన ప్రీతి ముకుందన్‌ ‘కన్నప్ప’తో హీరోయిన్ గా మారనుంది. తాజాగా ఈ సినిమాలో ప్రీతి ముకుందన్‌ను తీసుకుంటున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

Ranbir Kapoor: యానిమల్ రాముడు అయితే? జనం ఒప్పుకుంటారా?

‘‘కన్నప్ప’తో ప్రీతి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది, ఎంతో ప్రతిభ కలిగిన ఈ భరతనాట్య నర్తకి సినిమాకు మరింత ప్రత్యేకం కానుంది’ అని అంటూ సినిమా యూనిట్‌ పేర్కొంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన అయితే లేదు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్‌ లు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు, తాజాగా మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో మరికొంత మంది స్టార్స్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది కానీ ఆ విషయం మీద మాత్రం అధికారిక ప్రకటన లేదు.