Kannappa: ఎట్టకేలకు మంచు విష్ణు జోడీ దొరికేసిందోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Manchu’s ‘Kannappa’ To Feature Model Preity Mukhundhan as Female Lead: మంచు మోహన్ బాబు కుమారుడు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు బాలీవుడ్ రామాయణం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో సినిమా నుంచి తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ను అధికారికంగా ప్రకటిస్తామని ముందే మంచు విష్ణు ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా హీరోయిన్ ను ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఓ మోడల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు మోడల్‌గా పలు ప్రకటనల్లో కనిపించిన ప్రీతి ముకుందన్ ‘కన్నప్ప’తో హీరోయిన్ గా మారనుంది. తాజాగా ఈ సినిమాలో ప్రీతి ముకుందన్‌ను తీసుకుంటున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
Ranbir Kapoor: యానిమల్ రాముడు అయితే? జనం ఒప్పుకుంటారా?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
‘‘కన్నప్ప’తో ప్రీతి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది, ఎంతో ప్రతిభ కలిగిన ఈ భరతనాట్య నర్తకి సినిమాకు మరింత ప్రత్యేకం కానుంది’ అని అంటూ సినిమా యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన అయితే లేదు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్ లు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు, తాజాగా మోహన్ బాబు, శరత్ కుమార్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో మరికొంత మంది స్టార్స్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది కానీ ఆ విషయం మీద మాత్రం అధికారిక ప్రకటన లేదు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!