Manchu Vishnu : మంచు విష్ణు సొంత బ్యానర్ లో సినిమాలు ఆపేస్తాడా అనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎక్కువగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తోంది. అందులోనూ మంచు విష్ణు చాలా కాలంగా తన సినిమాలను సొంత బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆయన సినిమాలను ఆయనే నిర్మించుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కన్నప్ప మంచి హిట్ అయింది. మంచు విష్ణు బ్యానర్ లో చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీ ఆయన బ్యానర్ లో హిట్ అయింది. నటుడిగా ఈ సినిమాతో విష్ణుకు మంచి ప్రశంసలు అందుతున్నాయి.
Read Also : Manchu Vishnu : అతని వల్లే కన్నప్ప వాయిదా వేశా.. మంచు విష్ణు సీక్రెట్ రివీల్..
అయితే నిర్మాతగా సినిమాలు చేయడం అంటే చాలా రిస్క్. మూవీ హిట్ అయితే ఓకే గానీ.. ప్లాప్ అయితే మాత్రం కోట్లు నష్టపోవాల్సిందే. ఈ విషయం విష్ణుకు కూడా తెలుసు. ఇన్ని రోజులు ఏ కారణంతో తన సొంత బ్యానర్ లో సినిమాలు చేయలేదో తెలియదు గానీ.. ఇప్పుడు కన్నప్పతో ఆయనకు వస్తున్న పేరును చూస్తుంటే ఇతర బ్యానర్లలో మంచి అవకాశాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి తన సొంత బ్యానర్ అయిన అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లలో ఇక నుంచి సినిమాలు తీయడం ఆపేస్తాడనే ప్రచారం జరుగుతోంది. తనకంటూ కన్నప్ప ఓ విజిట్ కార్డు అని చెప్పుకున్న విష్ణు.. ప్రస్తుతం ఇతర బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హిట్ పడిన హీరోలకు అవకాశాలు మామూలుగానే వస్తుంటాయి. ఇప్పుడు విష్ణు కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారంట.
Read Also : Kannappa : కన్నప్ప రెండోరోజు కలెక్షన్లు ఎంతంటే..?
