Site icon NTV Telugu

Laththi Movie: విశాల్ ‘లాఠీ’కి ఓపెనింగ్స్ వచ్చేనా?

Vishal Laththi Movie

Vishal Laththi Movie

Laththi Movie: విశాల్ ఒకప్పుడు మాస్ హీరో. తన సినిమాలకు రన్ సంగతి ఎలా ఉన్నా కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో విశాల్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బాల్చీలు తన్నేస్తుండటంతో బిజినెస్ సంగతి అటుంచి కనీసం ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 22న విడుకాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుకానుంది. తెలుగులో విశాల్‌కు మార్కెట్ లేని కారణంగా తమిళ నిర్మాతలే తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. విశాల్ నటించిన ‘సామాన్యుడు’ ఈ ఏడాదే విడుదలై బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసింది. ఇక అంతకు ముందు వచ్చిన ‘యాక్షన్, చక్ర, ఎనిమీ’ సైతం అటు బయ్యర్లను, ఇటు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. దాని ప్రభావమే విశాల్ మార్కెట్ లేకుండా పోవటం. డబ్బింగ్ కోసం నిర్మాతలు అడగని పరిస్థితి అటుంచి పంపిణీదారులు, ప్రదర్శనదారులు సైతం విశాల్ సినిమాలపై ఆసక్తి చూపించటం మానేశారు. అప్పుడెపులో వచ్చిన ‘అభిమన్యుడు’ మాత్రమే ఆకట్టుకున్న విశాల్ సినిమా అని ఉత్తరాంధ్రకు చెందిన పంపిణీదారుడు అంటున్నారు.

Read Also: Padmaja Raju: అందాల నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం!

22న రాబోతున్న ‘లాఠీ’ సినిమాలో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు. అతనికి జోడీగా సునైనా నటించింది. వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. గతంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలను పోషించిన విశాల్ కానిస్టేబుల్ పాత్రలో ఎలా ఆకట్టుకుంటాడన్నది చూడాల్సి ఉంది. అండర్ కన్ స్ట్రక్షన్ బిల్డింగ్ లో నిర్భందించబడ్డ పోలీస్ కానిస్టేబుల్, అతని పది సంవత్సరాల కొడుకు ఎలా ఓ పొలిటీషియన్, అతని అనుచరుల బారి నుంచి తప్పించుకున్నారన్నది ‘లాఠీ’ కథాంశం. మరి ‘లాఠీ’తో విశాల్ పోగొట్టుకున్న తన మార్కెట్‌ను మళ్ళీ సొంతం చేసుకుంటాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Exit mobile version