Site icon NTV Telugu

Kollywood: హీరో విశాల్, కార్తీలను చంపుతామని బెదిరింపులు..!

Vishal

Vishal

స్టార్ హీరోలు విశాల్, కార్తీలకు హత్యా బెదిరింపులు రావడం కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. విశాల్, కార్తీలను చంపేస్తామని కోలీవుడ్ సహాయ నటుడు రాజదురై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నడిఘర్ సంఘం అధికారి ధర్మరాజ్ తేనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నడిఘర్ సంఘం అధ్యక్ష్యుడు నాజర్ నేతృత్వంలో సంఘ సభ్యులు కార్తీ, విశాల్.. సంఘం కోసం పోరాడుతున్నారని తెలిసిన విషయమే.. సినీ కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఈ సంఘం తరుపున విశాల్, కార్తీ ముందు ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారిపై అక్కసు పెంచుకున్న సహాయ నటుడు రాజదురై వారిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, వారిని చంపేస్తామని బెదిరిస్తున్నాడని ధర్మరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అంతేకాకుండా సోషల్ మీడియాలో వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి పలువురును రెచ్చగొడుతున్నాడని తెలిపారు. అతడిపై కఠిన చర్యలు తీసుకొని విశాల్, కార్తీకి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరారు. ఇక ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక విశాల్, కార్తీల కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం విశాల్ లాఠీ సినిమాలో నటిస్తున్నాడు.. ఇటీవలే ఈ షూటింగ్ లో గాయాలపాలైన విశాల్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. మరోపక్క కార్తీ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక హీరోలకు చావు బెదిరింపులు రావడంతో వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version