Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుంభమేళాలో పూసలమ్ముకుంటూ వైరల్ అయిన మోనాలిసా, ఏకంగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు ముందుగా సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా, ఆమె మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెతో సినిమా చేయాలని తాను 10 కోట్లు లోన్ తీసుకున్నానని, ఆమె వల్ల తాను అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
కానీ ఆమె మాత్రం ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని, ఇది కచ్చితంగా ‘లవ్ జిహాద్’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను తిరువనంతపురంలో పెళ్లి చేసుకున్న మోనాలిసా, కేరళ మీడియా ముందుకు వచ్చారు.
Also Read :Monalisa: “మోనాలిసా” చనిపోతానని బెదిరించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం
Also Read
తాను హిందూ ఆచారం ప్రకారం హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్నానని, ఇది కచ్చితంగా లవ్ జిహాద్ కాదని ఆమె డైరెక్టర్ సనోజ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని పేర్కొన్న ఆమె, ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.
అయితే, మోనాలిసా తెలుగులో కూడా ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. సాయి చరణ్ హీరోగా ఆమె ‘లైఫ్’ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. సాఫ్ట్వేర్ జీవితాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రారంభ సమయంలో వెల్లడించారు. అయితే, ఆ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది, అందులో మోనాలిసా పాత్ర షూటింగ్ పూర్తయిందా లేదా అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!