‘Vimanam’ registers 50 Million viewing minutes on ZEE5: ఓటీటీ మాధ్యమం జీ 5లో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘విమానం’ మూవీ స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ సినిమాను సంయక్తంగా నిర్మించారు. థియేటర్లో రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకున్న ఈ ‘విమానం’ సినిమా జూన్ 22 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, ప్రేమానురాగాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ విమానం మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా ఈ మధ్య కాలంలో ఇంతలా హార్ట్ టచింగ్ మూవీ రాలేదని అనిపించుకుంది.
Breaking : అనారోగ్యంతో ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం.. అసలు ఏమైందంటే?
ఇక అలా ఓటీటీలో అందరినీ అలరిస్తూ 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సినిమా దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాద్ బస్తీలో వీరయ్య (సముద్రఖని) అనే వ్యక్తికి కాలు ఉండదు. భార్య చనిపోవటంతో ఒక్కాగానొక్క కొడుకు (మాస్టర్ ధ్రువన్)ని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు, అయితే ఆ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. కొడుకుని విమానం ఎక్కించాలని వీరయ్య ఎంతో తపన పడుతుంటాడు చివరికి ఎలా విమానం ఎక్కించాడు అనేది సినిమా కథ. డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల టేకింగ్, చరణ్ అర్జున్ సంగీతం, వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయని ప్రశంసల వర్షం కురిపిస్తోంది.