Site icon NTV Telugu

VR: చందమామ కథను తలపించేలా ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్!

Vikranth Rona

Vikranth Rona

 

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విక్రాంత్ రోణ’ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తున్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించారు. అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ‘విక్రాంత్ రోణలో బాలీవుడ్ అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్స్ ను వివిధ భాషల్లో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్‌, తమిళ ట్రైలర్ ను ధనుష్, మలయాళీ ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్ తమ ట్విట్టర్ అక్కౌంట్స్ ద్వారా జనం ముందుకు తీసుకొచ్చారు.

రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. భయం ఆవరించిన ఓ ఊరిలోకి భయమంటే తెలియని వ్యక్తి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథ. అయితే దీనిని ఆసక్తికరంగా నెరేట్ చేయడంతో తర్వాత ఏం జరిగి ఉంటుందనే ఉత్సుకత ప్రతి సన్నివేశంలోనూ కనిపించింది. ఓ అందమైన చందమామ కథలా వీక్షకులను అది ముందుకు తీసుకెళ్ళిపోతోంది. విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉండటమే కాదు…. సినిమాటోగ్రఫీ సైతం అద్భుతంగా ఉంది. ఈ చిత్రాన్ని త్రీడీ లో చూడటమనేది విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ‘కేజీఎఫ్‌’ సీరిస్ మూవీస్ తో ఇవాళ కన్నడ సినిమాల మీద కూడా దేశ వ్యాప్తంగా అంచనాలు బాగా పెరిగాయి. కరోనా కారణంగా తగినంత సమయం చిక్కడంతో దర్శకుడు అనూప్ భండారి ‘విక్రాంత్ రోణ’ను తీరికగా, ఓపికగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ యాక్షన్ మూవీకి బి. అజనీష్‌ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహించగా, విలియమ్‌ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version