Site icon NTV Telugu

Cobra: విక్రమ్ ‘కోబ్రా’ తెలుగు హక్కులు ఎవరికంటే….

Cobra

Cobra

 

తెలుగులో ఈ యేడాది తొలి ప్రథమార్ధంలో వచ్చిన అనువాద చిత్రాలు ‘కేజీఎఫ్‌, విక్రమ్’ మంచి విజయం సాధించాయి. దాంతో మన నిర్మాతలు, పంపిణీదారుల దృష్టి పరభాషా చిత్రాల తెలుగు హక్కులపై పడింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ హక్కులను సొంతం చేసుకున్నారు. తొలి నుండి ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు.

అలానే దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తుకూ మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ చిత్రమే ‘కోబ్రా’. దీనిని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ తమిళంలో నిర్మించారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కె.ఎస్. రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ ‘కోబ్రా’కు సంగీతం అందిస్తున్నారు. మరి ‘కేజీఎఫ్, విక్రమ్’ మాదిరిగానే ‘కోబ్రా’సైతం విజయపథంలో సాగుతుందేమో చూడాలి.

Exit mobile version