Site icon NTV Telugu

SigmaTeaser : విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్.. ‘సిగ్మా’ టీజర్ రిలీజ్

Sigma

Sigma

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్  డైరెక్టర్ గా కోలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా సిగ్మా, ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలో సంపత్ రాజ్, రాజు సుందరం కనిపించనున్నారు. కోలీవుడ్ బడా చిత్రాల ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. టీజర్‌లో స్టైలిష్ యాక్షన్, ఇంటెన్స్ మేకింగ్, కొత్త తరహా కథనం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. హైస్ట్‌లు, ట్రెజర్ హంట్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు ఫోర్క్‌లిఫ్ట్ చేజ్‌లు మధ్య జరిగే ఇంటెన్స్ షూటౌట్ సీన్స్ వంటి స్టైలిష్ విజువల్స్ ప్రొమోలో ప్రత్యేకంగా నిలిచాయి. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సషన్ తమన్ ఈ సినిమాకు సంగీతమే అందిస్తున్నాడు. టీజర్ కు తమన్ ఇచ్చిన సౌండింగ్ కొత్తగా ఫ్రెష్ గా అనిపించింది.  దర్శకుడు జాసన్ సంజయ్ విజన్, ప్రెజెంటేషన్ హాలీవుడ్ స్థాయి మేకింగ్ లా అనిపించింది. షూటింగ్ దశలోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న సిగ్మా సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడిగా జాసన్ సంజయ్‌ తోలి సినిమా ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ విజయ్ ఫ్యాన్స్ లో ఉంది. విజయ్ సినిమాల నుండి తప్పుకుంటుండగా జాసన్ సంజయ్ డైరెక్టర్ గా స్టార్ స్టేటస్ అందుకోవాలని సిగ్మా టీమ్ కు అబిమానందనలు తెలుపుతున్నారు.

Exit mobile version