NTV Telugu Site icon

Largo Winch: సీడీలు ఇస్తే చరణాలు వేసి ఇస్తారు…

Largo Winch

Largo Winch

కింగ్ నాగార్జున హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘కింగ్’ మూవీ అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని అంత కన్నా ఎక్కువ పాపులర్ అవుతోంది. ఈ మూవీలోని బ్రహ్మానందం సీన్స్ ని మీమ్స్ కి టెంప్లేట్స్ గా వాడుతున్నారు మీమర్స్. ఎన్నో ఫన్నీ మీమ్స్ కి టెంప్లేట్స్ ఇచ్చిన కింగ్ మూవీ నుంచి కొత్తగా మరో మీమ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ‘వారిసు/వారసుడు’ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ జనవరి 11న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా ‘వారసుడు’ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఎన్నో తెలుగు సినిమాలని గుర్తు చేసేలా ‘వారసుడు’ ట్రైలర్ ఉందంటూ ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ‘కింగ్’ సినిమాలోని బ్రహ్మానందం, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి డైలాగ్ ని ఒకటి పెట్టి ఒక మీమ్ చేశారు. కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా నటించిన బ్రహ్మానందం ఒక సాంగ్ ని హమ్ చేసి, శ్రీనివాస్ రెడ్డిని ఎలా ఉందిరా అని అడిగితే దానికి సమాధానంగా శ్రీనివాస్ రెడ్డి “ఆజ్ ఇట్ ఈజ్ ఉంది, సీడీలు ఇస్తే చరణాలు’ వేసి ఇస్తారు” అంటాడు. ఆ తర్వాత ఏ సినిమా, ఏ సాంగ్ ఇంకో దానికి కాపీగా కనిపించినా వెంటనే మీమర్స్ “సీడీలు ఇస్తే చరణాలు వేసి ఇస్తారు, ఆజ్ ఇట్ ఈజ్” ఉంది అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ‘వారసుడు’ ట్రైలర్  కూడా చేరింది. ఈ ట్రైలర్ ని చూడగానే ‘లార్గో వించ్’ సినిమాలా ఉంది అనిపించగానే బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డిలని పెట్టి మీమ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2008లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ యాక్షన్ మూవీ ‘ది హెయిర్ అప్పారెంట్: లార్గో వించ్’. జేరోమి సల్లే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్రెంచ్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగులో ఇదే సినిమాని అటు ఇటు మార్చి మాటల మాంత్రికుడు ‘అజ్ఞాతవాసి’ సినిమా చేశాడు. పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ మెగా అభిమానులకి ఒక పీడ కలగానే మిగిలింది. ఆ తర్వాత బాహుబలి హీరో ప్రభాస్ ని పెట్టి ‘లార్గో వించ్’ సినిమానే ‘సాహో’గా తెరకెక్కించాడు ‘సుజీత్’. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఒకే కథని ఇన్స్పిరేషన్ గా తీసుకోని రూపొందిన ఈ రెండు భారి సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. ఒకే కథతో సినిమా ఎలా చేశారు అంటూ సాహో మేకర్స్ పైన విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ‘వారసుడు’ ట్రైలర్ ని చూసిన వాళ్లు ‘లార్గో వించ్’ సినిమాని ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ‘వారసుడు’ సినిమా నిజంగా ‘లార్గో వించ్’ సినిమాకి ఇన్స్పిరేషనా కాదా అనేది తెలియాలి అంటే జనవరి 11 వరకూ ఆగాల్సిందే.