Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ట్రైలర్

Vijay Sethupathi's Tughlaq Durbar Trailer

తమిళనాట ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ ఒకటి. కోవిడ్ కారణంగా థియేటర్ బాట వదలి డిజిటల్ బాట పట్టింది ‘తుగ్లక్ దర్బార్’. నిజానికి సినిమా మే 2020 లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఎట్టకేలకు ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌ లో రాబోతోంది. సెప్టెంబర్ 11న రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు.

Read Also : జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ… ఫస్ట్ పోస్ట్ కే అదిరిపోయే రెస్పాన్స్

ట్రైలర్ చూస్తుంటే ప్రస్తుత రాజకీయాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రంలా అనిపిస్తోంది. విజయ్ సేతుపతి మార్క్ ట్రైలర్ అంతటా కనిపిస్తూ మనల్ని నవ్విస్తాయి. ‘ఇంకా మూడువందల ఏళ్లైన ఇక్కడ మారేది ఏమీ లేదు. మనల్ని మారనిన్వరు’, ‘బామ్మర్ది… యూజింగ్ మి, టార్చర్ మి, వేర్ ఈ మి డ’, ‘రాజకీయంలో విశ్వాసం అనేది ఓ లెక్క’ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా చమత్కారంగా ఉన్నాయి. ఈ సినిమాలో మంజిమా మోహన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటులు సత్యరాజ్, పార్థిబన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందించారు. సెప్టెంబర్ 11 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.

Exit mobile version