జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ… ఫస్ట్ పోస్ట్ కే అదిరిపోయే రెస్పాన్స్

కోలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా ఎప్పటికప్పుడు తమ సినిమాలకు సంబంధించిన, వ్యక్తిగత సమాచారాన్ని అభిమానులతో షేర్ చేసుకోగలుగుతున్నారు. కానీ జ్యోతిక మాత్రం సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉండిపోయింది. ఆమె ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో అడుగు పెడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పేసింది జ్యోతిక.

Read Also : “ఎంజామీస్”తో ధనుష్ పార్టీ… పిక్ వైరల్

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జ్యోతిక సోషల్ మీడియాలో చాలా ఉత్సాహంగా అడుగు పెట్టింది. ఇప్పుడు జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ సందర్భంగా షేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి పోస్ట్‌గా తన కాశ్మీర్ పర్యటన నుండి కొన్ని ఫోటోలను పంచుకుని అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. “అందరికీ నమస్కారం! మొదటిసారిగా సోషల్ మీడియాలో! నా లాక్డౌన్ డైరీల నుండి కొన్ని ఫొటోలు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున హిమాలయాలలో, అందమైన కాశ్మీర్ గ్రేట్ లేక్స్, 70 కిమీ ట్రెక్, బికట్ అద్భుతమైన సాహసాల బృందంతో- రాహుల్, సచిన్, రౌల్, అశ్విన్, కాశ్మీర్ జట్టు ముస్తాక్ ఎన్ రియాజ్ భాయ్. మీకు ధన్యవాదములు. !! భారతదేశం చాలా అందంగా ఉంది! జై హింద్!” అంటూ పిక్స్ షేర్ చేసింది.

ఆమె ఆ పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. జ్యోతిక మొదటి పోస్ట్ కు దాదాపు 269,155 లైక్‌ల వర్షం కురిసింది. ఆమెకు సోషల్ మీడియాలోకి స్వాగతం చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతిక భర్త సూర్య సైతం ఆమె సోషల్ మీడియా ఎంట్రీపై సంతోషం వ్యక్తం చేశారు. “నిన్ను ఇన్‌స్టాలో చూసినందుకు థ్రిల్ అయ్యాను!” అంటూ ఫోటో షేరింగ్ యాప్‌లో ఆమె అరంగేట్రంపై కామెంట్ చేశారు.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

Related Articles

Latest Articles

-Advertisement-