RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినదగ్గరనుంచి ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా.. ? ఎవరెవరు ఈ సినిమాలో నటిస్తున్నారో తెలుసుకోవాలని అభిమానులు ఊవిళ్లూరుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు అనేసరికి ఫ్యాన్స్ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.
Kavya Kalyanram: అల్లు అర్జున్ ముసలివాడు అయిపోతాడు.. హీరోయిన్ గా చేయను..
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని రంగంలోకి దించుతున్నారట. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతినే విలన్ అన్న విషయం తెల్సిందే. వైష్ణవ్ తేజ్ ను సైతం మరిపించే నటనతో సేతుపతి అదరగొట్టేశాడు. ప్రస్తుతం విలన్ గా బిజీగా ఉన్న ఆయన.. RC16 లో చరణ్ కు ధీటైన విలన్ గా నిలబడనున్నాడట. ఇప్పటికే విజయ్ సేతుపతితో చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఒకపక్క చరణ్ ను.. ఇంకోపక్క విజయ్ ను చూడడానికి రెండు కళ్లు సరిపోవని అభిమానులు అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.