Site icon NTV Telugu

Kayadu Lohar : విజయ్ ఎంత మందిని బలితీసుకుంటావ్.. ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

Kayadu

Kayadu

Kayadu Lohar : తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం నిండిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పదుల కొద్దీ హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ కాయడు లోహర్ పేరు మీద ఓ పోస్టు సంచలనం రేపుతోంది. విజయ్ ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్.. నీ స్టార్ డమ్ కోసం ఎంత మంది చనిపోవాలి. ఇదంతా నీ స్వార్థ రాజకీయం వల్లే అంటూ ఓ పోస్టు సెన్సేషనల్ గా మారింది.

Read Also : Saif Ali Khan : ఆమెకు ముద్దు పెడితే వెయ్యి ఇచ్చేది.. సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అది ఫేక్ అకౌంట్ అని హీరోయిన్ స్పష్టం చేసింది. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో క్లారిటీ ఇచ్చింది. కొందరు నా పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. అదంతా ఫేక్.. దయచేసి నమ్మొద్దు. కరూర్ లో జరిగిన ఘటన నా మనసును కలిచివేసింది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది కాయడు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ఆమె విజయ్ మీద ఇలా ఎందుకు ట్వీట్ చేస్తుందని పెద్ద చర్చ జరిగుతోంది.

Read Also : Bigg Boss : సంజనా కాదు.. ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్

Exit mobile version