Site icon NTV Telugu

Vishal: నడిఘర్ సంఘానికి విజయ్ కోటి విరాళం.. థాంక్స్ చెప్పిన విశాల్

Vishal

Vishal

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే సొంత పార్టీని కూడా అనౌన్స్ చేసిన విజయ్.. ప్రచారాలు కూడా మొదలుపెట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడే పనులు చేసి తమిళనాడులో మంచి పేరును తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా విజయ్.. నడిఘర్ సంఘానికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. ఆ చెక్ ను నడిఘర్ సంఘ అధ్యక్ష్యుడు,నటుడు విశాల్ కు అందచేశాడు ఈ విషయాన్ని విశాల్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. “విజయ్.. థ్యాంక్యూ అంటే కేవలం రెండు పదాలు, కానీ ఒక వ్యక్తి తన మంచి మనసు తో చేస్తే అది అంతకుమించిన అర్ధం అవుతుంది. మా SIAA, నడిఘర్ సంఘ నిర్మాణ పనులకు ఒక కోటి విరాళం ఇచ్చినందుకు నా అభిమాన నటుడు మా స్వంత తలపతి విజయ్ సోదరుడి గురించి మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను దీవించు గాక. అవును, మీ మద్దతు మరియు ప్రమేయం లేకుండా భవనం అసంపూర్తిగా ఉంటుందని మాకు ఎల్లప్పుడూ తెలుసు. ఇప్పుడు మీరు వీలైనంత త్వరగా జరిగేలా మాకు ఆజ్యం పోశారు సోదరా. థాంక్యూ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక విశాల్.. నడిఘర్ సంఘం కోసం ఒక భవనాన్ని కట్టాకనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన విషయం తెల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఈ భావం నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తీ అయ్యింది లేదు. విశాల్ ఈ విషయంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఎంతో డబ్బును తన వ్యక్తిగత విషయాలకు వాడుకుంటున్నాడని ఎన్నో కేసులు కూడా విశాల్ పై ఉన్నాయి. కానీ, తాను మాత్రం నడిఘర్ సంఘ సభ్యులకు మంచే చేస్తున్నాను అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ భవనం ఎప్పుడు పూర్తీ అవుతుందో చూడాలి.

Exit mobile version