Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ మూవీ ఆడితే చాలా పెద్దోన్ని అవుతా సామీ.. ఇది గనక హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు’ లాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. వీటిపై నానా రచ్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు విజయ్ ను ఇప్పుడు అడ్డుకుంటుంది ఎవరు.. ఆయన్ను ఎవరైనా వెనక్కు నెట్టేస్తున్నారా.. ప్రతిసారి ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు.
Read Also : Samantha : ఆ పచ్చబొట్టు అలాగే ఉంచుకున్న సమంత..
గతంలో లైగర్ మూవీ ఈవెంట్ లో కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. ఇండియా షేక్ అవుతుంది అంటూ కొంచెం ఓవర్ గానే రియాక్ట్ అయ్యాడు. లైగర్ ప్లాప్ అవడంతో.. విజయ్ కామెంట్స్ మీద దారుణమైన ట్రోలింగ్ నడిచింది. ఒకవేళ విజయ్ ఆ కామెంట్లు చేయకపోయి ఉంటే ఆ స్థాయి నష్టం జరిగేది కాదేమో. ప్లాప్ అని అనేవారు. కానీ ఇండియా షేక్ అవడం ఏంటంటూ ట్రోల్ చేసే దాకా వెళ్లింది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని చెబితే ఓకే. అంతే గానీ.. మూవీ హిట్ అయితే అందరికంటే పెద్దోన్ని అయిపోతా అని చెప్పడం వల్ల ట్రోల్ అవడం తప్ప ఉపయోగం లేదు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంటే దాని గురించి మాట్లాడాలి.
కానీ ఉన్నదాని కంటే ఎక్కువ మాట్లాడితే అది మంచి ఇంప్రెషన్ ను కూడా నెగెటివిటీకి దారి తీసేలా చేస్తుంది. విజయ్ కింగ్ డమ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. ఇలాంటప్పుడు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. మీ ఆదరణ ఉండాలి అనే సాదా సీదా కామెంట్లు సరిపోతాయి. ఎందుకంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి ఈ విషయాలు విజయ్ గుర్తుంచుకుంటే మంచి పొజీషన్ కు ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ వచ్చేసింది..
