విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “వీడీ 14” మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. “వీడీ 14” చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.
Also Read:Allu Arjun: అల్లు అర్జున్‌కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా?
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “వీడీ 14” సినిమా రూపొందుతోంది. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత “వీడీ 14″లో మూడోసారి రశ్మిక, విజయ్ జంటగా కనిపించనున్నారు.
