NTV Telugu Site icon

Vijay Deverakonda: విజయ్ ఇచ్చే లక్ష కావాలంటే ఆ పని చేయాల్సిందే..

Vd

Vd

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ హిట్ తరువాత విజయ్ ఖుషీతో హిట్ అందుకున్నాడు. ఇక ఈ సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకోవాలని సరికొత్తగా ఆలోచించాడు. ఇప్పటివరకు ఏ హీరో చేయని ఒక అరుదైన పనిని విజయ్ చేశాడు. ఖుషీకి వచ్చిన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలను.. అభిమానుల్లోని 100 మంది ఫ్యామిలీస్ కు ఇస్తున్నా అని చెప్పి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు ఒక హీరో.. ఇలా అభిమానులకు డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు. హా .. ఇవన్నీ ప్రమోషన్ స్టంట్ .. వేదిక మీద చెప్తారు.. ఆ తరువాత మర్చిపోతారు. కానీ, విజయ్ అలా కాదు. తాను చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాడు.

Allu Arjun: ఐకాన్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీ.. జవాన్ డైరెక్టర్ తో.. ?

ఇక తాజాగా ఆ లక్ష రూపాయలు కావాలంటే.. అభిమానులు డీటెయిల్స్ పంపమని ఒక లింక్ షేర్ చేశాడు. అందులో మీరెక్కడ ఉంటారు.. ఎంతమంది..? చిన్నపిల్లలు ఎంతమంది.. ? ఈ పర్సనల్ డీటెయిల్స్ పాటు.. ఈ లక్ష రూపాయలు మీకు వస్తే ఏం చేస్తారు.. ? అనేది కూడా అడిగారు. అందులో సరైన సమాధానం రాసి పంపిస్తే .. అది విజయ్ మనసుకు నచ్చితే.. ఆ వందమందిలో మీరు కూడా ఒకరు.. ? మరి ఇంకెందుకు ఆలస్యం. విజయ్ పంపిన లింక్ మీద క్లిక్ చేయండి.. లక్ష రూపాయలు గెలుచుకొనే అవకాశం పొందండి.