Vijay Deverakonda Says these three are Important: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్, ఐడి కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయని భయపడి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవాడిని, కానీ ఒకటి రెండేళ్ల తర్వాత ప్రీమియం కట్టలేక డిస్ కంటిన్యూ చేసేవాడిని, అలా ఎన్ని ఇన్సూరెన్స్ లు తీసుకున్నానో? ఒక వేళ హెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఏమైనా ఎయితే ఎవరికీ కాల్ చేయాలో కూడా తెలియదు అన్నారు.
Dil Raju: దేవరకొండని స్టార్ గా చూపియ్యాలని… వాళ్ళందరూ ఫామిలీ స్టార్స్!
అయితే ఇక్కడ మాత్రం చాలా పకడ్బందీగా చేస్తున్నామని అసోసియేషన్ వాళ్ళు చెప్పడం ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే నమ్ముతా, మన లైఫ్ లో మూడు ముఖ్యమైనవి అవి ఆరోగ్యం, ఆనందం, డబ్బు అని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ మూడు ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదిస్తే ఇలా ఇన్సూరెన్స్లు కట్టుకుని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయవచ్చు, డబ్బు సంపాదిస్తూ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా కూడా దానంతట అదే వస్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు.
