Site icon NTV Telugu

Vijay Devarakonda: 12th ఫెయిల్ సినిమాపై విజయ్ ప్రశంసలు..

Vijay

Vijay

Vijay Devarakonda: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ జంటగా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్‌. ముంబై క్యాడర్‌ కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్‌.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా సివిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సివిల్స్‌కి ప్రిపేర్‌ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఎన్నో ఎమోషన్స్ కలగలిపాడు దర్శకుడు. ఒక విజయాన్ని సాదించాలి అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి అని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, నిజమైన ప్రేమ.. కష్టాలను చూసి పారిపోదు అని.. ఇలా ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 23 న రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్‌ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక్కడ కూడా తన సత్తా చాటుతోంది. ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ” పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రతి తల్లి, తండ్రి మరియు అమ్మమ్మలకు.. మరొకరికి స్ఫూర్తినిచ్చే ప్రతి దుష్యంత్ సర్‌కి.. పాండే మరియు గౌరీ భాయ్ వంటి ప్రతి స్నేహితుడికి..శ్రద్ధా లాంటి అమ్మాయికి మరియు అక్కడ ఉన్న ప్రతి మనోజ్‌కి.. నా ప్రేమను అందిస్తున్నాను.మీరు ప్రతి పోరాటాన్ని అధిగమించి విజయం సాధించండి.. #12thFail యొక్క తారాగణం మరియు బృందానికి – ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version