NTV Telugu Site icon

Family Star: ఫ్యామిలీ స్టార్ ఈవెంటుకి బైకుపై వెళ్లిన విజయ్, మృణాల్

Vijay Mrunal On Bike

Vijay Mrunal On Bike

Vijay Deverakonda Mrunal thakur Entry on Bike for Family Star Pre Release Event: విజయ్ దేవరకొండ హీరో గా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాని ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది అని సినిమా యూనిట్ చెబుతోంది.

Maidaan Traileer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న మైదాన్ ట్రైల‌ర్‌

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మైసమ్మగూడలో ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి దిల్ రాజు, శిరీష్ హాజరయ్యారు. దిల్ రాజు భార్య వైఘా రెడ్డి కూడా ఈవెంట్ కి హాజరైంది. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ బైక్ మీద వేదిక వద్దకు వచ్చారు. సినిమాలో ఏదైతే బైక్ వాడారో అదే బైక్ మీద ఈ ఇద్దరూ వేదిక వద్దకు రావడం హాట్ టాపిక్ అయింది. విజయ్ దేవరకొండకి మొదటి నుంచి తాను చేసే సినిమాలను వినూత్నంగా ప్రమోట్ చేసే అలవాటు ఉంది. ఈ సినిమా విషయంలో కూడా విజయ్ దేవరకొండ అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు వేదిక వద్దకు బైక్ మీద రావు ఎంట్రీ హాట్ టాపిక్ అవుతోంది.