Site icon NTV Telugu

Vijay Deverakonda : విజయ్ దేవరకొండా.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే!

Vijay

Vijay

Vijay Deverakonda As A Chief Guest For Keedaa Cola Pre-release Event: దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మూడో చిత్రం కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం అయింది. 2వ తేదీన యుఎస్ఎ, కొన్ని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రమోషన్ మెటీరియల్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ దగ్గర పడడంతో రేపు హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. విజయ్ కి మొదటి హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ మూడో సినిమాకి యూత్‌లో ఒక రేంజ్ క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ రావడం హాట్ టాపిక్ అవుతోంది.

CM KCR: కామారెడ్డిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్

ఇక విజయ్ దేవరకొండ ప్రజన్స్ ఈవెంట్‌ను మంచి హిట్‌గా మార్చి సినిమాకు ఎడిషనల్ బజ్‌ని సంపాదించడంలో సహాయపడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కు జనం పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం వరదరాజులు తాతగా, చైతన్యరావు వాస్తుగా, రాగ్ మయూర్‌గా లంచమ్‌గా, నాయుడుగా తరుణ్‌, సికిందర్‌గా విష్ణుగా, జీవన్‌కుమార్‌గా జీవన్‌, రవీంద్ర విజయ్‌, షాట్స్‌గా రఘురామ్‌గా కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ ఎజె ఆరోన్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఉపేంద్ర వర్మ ఎడిటర్ కాగా ఆశిష్ తేజ పులాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్, తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ అందించారు. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన కీడా కోలా విజి సైన్మ మొదటి ఫీచర్-లెంగ్త్ ప్రొడక్షన్ గా నిలవనుంది.

అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది, అదేమంటే నిజానికి విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ఇద్దరూ ఒకేసారి హిట్ కొట్టారు. విజయ్ దేవరకొండకు అది హీరోగా మొదటి హిట్. అప్పటి వరకు నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయనని నమ్మి తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా చేశారు. వారి కష్టం ఫలించింది, పెళ్లిచూపులు చిన్న సినిమాగా మొదలై పెద్ద హిట్ అయింది. ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి హిట్లు పడడంతో పాటు లైగర్, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకున్నాడు దేవరకొండ. తరువాత తమ్ముడిని లాంచ్ చేయడమే కాదు బేబీ లాంటి సినిమాతో ఆయన కూడా హిట్ కొట్టాడు. ఇక తరుణ్ కూడా కాళీగా ఏమీ లేడు, ఈనగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ సినిమా చేసి దానితో కల్ట్ హిట్ కొట్టడమే కాదు నటుడిగా కూడా మారాడు. తరుణ్ హీరోగా ఒక సినిమా చేస్తుంటే విజయ్ దేవరకొండ దాన్ని ప్రొడ్యూస్ చేసి కొంతవరకు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు తరుణ్ మూడో సినిమా ఈవెంట్ కి విజయ్ చీఫ్ గెస్ట్ గా పిలవడం, ఆయన రావడం పెద్ద విషయం కాదు కానీ ఆయన ఆ రేంజ్ కి వెళ్లడమే అసలైన సక్సెస్ అంటున్నారు విజయ్ అభిమానులు.

Exit mobile version