Site icon NTV Telugu

కామ్రేడ్ తో రష్మిక మందన్న వర్కౌట్లు… పిక్ వైరల్

Vijay Deverakonda and Rashmika Mandanna together in gym

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మంచి స్నేహితులు. అంతేకాదు వారి మధ్య మంచి అనుబంధం ఉంది. “డియర్ కామ్రేడ్”, “గీత గోవిందం” సినిమాల్లో వీరి వెండి తెర రొమాన్స్ ప్రేక్షకులను ఫిదా చేసేసింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనేంతలా వారి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. తాజాగా విజయ్, రష్మిక ఒకే జిమ్ లో వర్కౌట్లు చేయడం సంచలనంగా మారింది. వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ కుల్దేప్ సేథి తన ఇన్‌స్టాగ్రామ్ లో జిమ్‌లో వర్కవుట్ సెషన్‌లో వీరిద్దరూ ఉన్న పిక్స్ పంచుకున్నారు. వారి గురువుగా నేను సంతోషంగా ఉన్నాను, గర్వపడుతున్నాను అని కామెంట్ చేశారు. ఫోటోలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండతో పాటు ఆయన కూడా ఉన్నాడు.

Read Also : “చిరు 155” టైటిల్ రివీల్ చేసిన మహేష్

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ “లైగర్”లో అనన్య పాండేతో కనిపించనున్నారు. ఈ చిత్రం కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరి జగన్నాధ్ హిందీ-తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు రష్మిక మందన్న తెలుగులో పాన్ ఇండియా మూవీ “పుష్ప”తో పాటు హిందీలో అమితాబ్ తో “గుడ్ బై”, సిద్ధార్థ్ మల్హోత్రాతో “మిషన్ మజ్ను” చిత్రాల్లో కనిపించనుంది.

Exit mobile version