The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Deverakonda Foundation : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన తండ్రి స్వగ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిచ్చే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామం విజయ్ దేవరకొండ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇదే తన తండ్రి స్వగ్రామం కావడంతో ఆ ఊరిపై ఆయనకు చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చాలా కాలంగా తన మనసులో ఉన్న ఒక చిన్ననాటి కలను నిజం చేసుకునే దిశగా ఇప్పుడు ఆయన ముందడుగు వేశారు. ఫిబ్రవరిలో ప్రకటించిన ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తూ, విజయ్ దేవరకొండ రష్మిక మందన్నతో కలిసి స్వగ్రామానికి బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మందికి భారీ స్కాలర్షిప్లు అందించనున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలే కాదు, సమాజ సేవలోనూ తాము ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించిన స్టార్ కపుల్ “విరోష్”!
Also Read
ఈ కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే, ఎంపికైన 180 మంది విద్యార్థుల పూర్తి జాబితాను విజయ్ దేవరకొండ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కష్టపడి చదివి తమ కుటుంబాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ ఆయన చేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతుంటాయి. అభిమానులు ప్రేమగా ‘విరోష్’ అని పిలిచే ఈ జంట ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం సినిమా కాదు, సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే ఆలోచనతో.
We are on our way to Thummanpet.
The little village where my Father was born.In February – @iamRashmika and I had announced the beginning of a little dream of ours.
To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana.
Here is a… pic.twitter.com/wLNSr4ZZHe
— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026
ఇక స్వగ్రామంతో తనకు ఉన్న అనుబంధం గురించి విజయ్ దేవరకొండ భావోద్వేగంగా స్పందించారు. ఊరితో తనకు ప్రత్యేకమైన బంధం ఉందని, అక్కడ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కలలకు రెక్కలు కట్టే ప్రయత్నం చేస్తున్న విజయ్ దేవరకొండ చర్య ఇప్పుడు అనేకమందికి స్ఫూర్తిగా మారుతోంది. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుండగా, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- cinema
- Vijay Deverakonda
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!