Vijay Devarakonda: అప్పుడే సామ్ ని టీజ్ చేయడం కూడా మొదలుపెట్టేశాడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేయబోతున్న సంగతి తెలిసిందే. నేడు పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. అయితే ఈ పూజా కార్యక్రమానికి సమంత అటెండ్ కాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి పూజ జరుగుతుంటే సామ్ ఎక్కడికి వెళ్లిందని ఫ్యాన్స్ ఆరా తీశారు.
తన సినిమాలకు సంబంధించిన బిజీ షెడ్యూల్స్ ని పూర్తి చేసి సామ్ వెకేషన్ కి కోసం దుబాయ్ కి వెళ్లిన విషయం విదితమే. అయితే ఉదయం నుంచి సామ్ ఎక్కడ ..? సామ్ ఎక్కడ..? అని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్న తరుణంలో రౌడీ బాయ్ విజయ్ సామ్ ను టీజ్ చేయడమే కాకుండా.. అభిమానులను కూడా ఆట పట్టించాడు. ఒరిజినల్ పూజా కార్యక్రమంలోని గ్రూప్ ఫొటోలో సమంత, వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ఫోటోలను ఎడిట్ చేసి.. ఇది ఈరోజు జరిగిన పూజా కార్యక్రమం ఒరిజినల్ ఫోటో.. దయచేసి మీడియా మిత్రులు ఈ ఫోటోను వాడవాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు సామ్ నవ్వుతున్న ఎమోజీ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇంకా మొదలే కాలేదు రౌడీ బాయ్ .. సామ్ ని టీజ్ చేస్తున్నాడే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
The Actual Pooja photo! With the darlings @Samanthaprabhu2 @vennelakishore @eyrahul
Request the press to share the actual photo 🙂 thank you. pic.twitter.com/Fz3bfVCIK2
— Vijay Deverakonda (@TheDeverakonda) April 21, 2022
- Tags
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!