Site icon NTV Telugu

సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం

Vijay-Devarakonda

తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోందంటూ ట్వీట్ చేశారు. “నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను… తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ” అంటూ విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

https://ntvtelugu.com/naga-chaitanya-has-a-huge-fan-boy-moment-as-he-met-dj-composer-ben-bohmer/

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరల విషయంలో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినీ పరిశ్రమకు అండగా ఉంటూ అభయహస్తం అందిస్తోంది. టికెట్ ధరలను పెంచాలన్న టాలీవుడ్ సినీ పరిశ్రమ అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొత్త జీవోను కూడా జారీ చేశారు. సదరు జీవో ప్రకారం జీఎస్టీ మినహా ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా, మల్టీప్లెక్స్‌లలో ధర రూ. 100+GST, గరిష్టంగా రూ.250+GST తో ధరలను నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్‌టీ టిక్కెట్‌కు రూ. 5 (ఎసి) మరియు టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్‌లకు అనుమతి లభించడంపై సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version