లయన్ తో లైగర్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నందమూరి నటసింహం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న పాపులర్ షో “అన్‌స్టాపబుల్’లో ‘లైగర్’ టీం పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఈ తాజా ఎపిసోడ్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పూరి జగన్నాథ్, ఛార్మి కూడా కనిపించబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ప్రోమోను విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ అవుట్ ఫిట్, స్టైల్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక బాలయ్య పక్కా తెలుగు లుక్ లో పంచె కట్టుతో ఆకట్టుకుంటున్నారు. “అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే”లో ఈ ప్రత్యేక ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న ‘ఆహా’లో ప్రసారం కానుంది.
Read Also : ఏపీ టిక్కెట్ల వివాదం లో ఆర్జీవీ వ్యూహం ఫలిస్తుందా..?
ఇక ఇటీవలే ‘అఖండ’తో బాలయ్య మంచి హిట్ ను అందుకోగా, ఇప్పుడు గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆమరోసారి ఆగింది. తెలుగు, హిందీలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అనన్య పాండే కూడా నటిస్తుండగా, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ , పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘లైగర్’ 2022 ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కానుంది.