NTV Telugu Site icon

Vijay Devarakonda: అభిమానులకు విజయ్ దేవరకొండ క్రిస్మస్ కానుక

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda: ఐదు సంవత్సరాల క్రితం తను ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయ్ దేవరకొండ ఈ క్రిస్మస్ కి కూడా దేవర శాంటాగా ప్రత్యక్షం అయ్యాడు. అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతజ్ఞతగా వారికి క్రిస్మస్, లాక్ డౌన్ సందర్భంగా బహుమతులు ఇస్తూ వచ్చాడు. క్రిస్మస్ ఈవ్ లో దాదాపు 600 మంది పిల్లలతో టైమ్ స్పెండ్ చేయటమే కాకుండా వేయి మందికి బహుమతులు అందచేశాడు. 5 ఏళ్ళ సంప్రదాయాన్ని ఈ క్రిస్మస్ కి కూడా కొనసాగించి దేవరా శాంటా క్యాప్‌ ధరించాడు.

Read also: Cheryala ZPTC Mallesham: జెడ్పీటీసీ మల్లేశంపై గొడ్డళ్లు కత్తులతో దారుణ హత్య.. వారిపై అనుమానం

అంతే కాదు అభిమానులను ఉత్సాహపరుస్తూ ఓ వంద మందికి వారు కోరుకున్న ప్రదేశంలో హాలిడే ఎంజాయ్ చేసేలా ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తానని చెబుతూ ట్వీట్ చేశాడు. ‘దేవరా శాంటా, 5 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాను. ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నా. మీలో 100 మందిని అన్ని ఖర్చులు భరిస్తూ కోరుకున్న చోట హాలీడేని గడపేలా ఏర్పాట్లు చేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. తమ తమ డెస్టినేషన్ తో విజయ్ కి వినతులు పంపుతున్నారు. ‘లైగర్’ ప్లాఫ్ తర్వాత విజయ్ ప్రస్తుతం సమంతతో కలసి శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే పవన్ నటించిన ‘ఖుషీ’ సినిమా ఈ నెల 31న రీరిలీజ్ చేస్తుండటం విశేషం.


Kodali Nani: భయం ఉంది కాబట్టే.. గెలుస్తున్నాం