కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ తో ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఒక గూఢచారి అయిన హీరో షాపింగ్ మాల్ ని హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో లో అరబిక్ దేశాలు ప్రోత్సహించని ఇస్లామిక్ టెర్రరిజాన్ని చూపిస్తుండడంతో గల్ఫ్ దేశం ఈ సినిమాను నిషేధించింది.
అరబ్ దేశాలను విలన్లు గా ఉగ్రవాదులకు నిలయంగా చూపించే ఏ సినిమాను గల్ఫ్ దేశం అంగీకరించదన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఎక్కువగా కువైట్, గల్ఫ్ దేశాల్లో దాక్కుంటారని, అందుకు అక్కడ చట్టాలు సహకరిస్తాయని కూడా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే రిలీజైన కురుప్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇకపోతే ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూడాలని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కువైట్ లోని దళపతి అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. మరి ఈ విషయమై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
