Vijay Antony: విజయ్ ఆంటోనీ బర్త్‌డే స్పెషల్.. ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Antony: ప్రముఖ హీరో విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ZEE5 తెలుగు ఈ చిత్రాన్ని ఆగస్టులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే సినిమా స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇటీవల ‘పరిమళ & కో’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ZEE5 తెలుగు.. ఇప్పుడు మరో హృద్యమైన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ ఆంటోనీ నటించిన ‘వంద దేవుళ్లు’ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలవనుందని మేకర్స్ తెలిపారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓ తల్లి, ఆమె ఇద్దరు కొడుకుల చుట్టూ సాగుతుంది. నలభై ఏళ్లు దాటిన ఓ తల్లి తన జీవితంలో మరోసారి తోడు కోసం ఆలోచించినప్పుడు ఎదురయ్యే సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, సమాజం నుంచి వచ్చే విమర్శలను ఈ చిత్రం చూపిస్తుంది. తల్లి జీవితంలోని త్యాగాలను గుర్తించిన కొడుకు.. ఆమె సంతోషం కోసం సమాజాన్ని ఎదుర్కొనే కథాంశమే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తల్లీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చూపించిన ఈ చిత్రం వివాహం, మాతృత్వం, మహిళల స్వతంత్ర నిర్ణయాలు వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. థియేటర్లలోనూ మంచి స్పందన అందుకున్న ‘వంద దేవుళ్లు’లోని సహజమైన భావోద్వేగాలు, నటీనటుల అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కుటుంబంతో కలిసి చూసేలా ఉండే ఈ చిత్రం అన్ని తరాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఈ సందర్భంగా ZEE5 మార్కెటింగ్ సౌత్, తమిళ & మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి జేవియర్ మాట్లాడుతూ.. ‘‘పరిమళ & కో’కు వచ్చిన స్పందన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌పై ప్రేక్షకుల ఆసక్తిని మరోసారి నిరూపించింది. ‘వంద దేవుళ్లు’తో అదే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మంచి కథలను అన్ని భాషల ప్రేక్షకులకు అందించడమే మా లక్ష్యం’’ అని తెలిపారు. ‘వంద దేవుళ్లు’ ఈ ఆగస్టులో ప్రత్యేకంగా ZEE5లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్‌తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!