NTV Telugu Site icon

Vijay Antony: బిచ్చగాడు.. ‘బ్రో’ తో పోటీ పడుతున్నాడే.. ?

Vijay

Vijay

Vijay Antony: బిచ్చగాడు 2 తో ఈ ఏడాది సెన్సేషన్ సృష్టించాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. భారీ విజయాన్ని అందుకొని రికార్డులను కొల్లగొట్టింది. విజయ్ ఆంటోనీ పేరు తెలుగులో చాలాకాలం వినిపించేలా చేసిన సినిమా బిచ్చగాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత విజయ్ నుంచి వస్తున్న మరో చిత్రం హత్య. బాలాజీ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి, నందితా శ్వేత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అసలు ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జూలై 21 న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల కంట్లో పడ్డ విజయ్ నెక్స్ట్ సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక మరోపక్క క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఎలాగూ ఆసక్తి ఉంటుంది. కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా హిట్ అందుకున్నట్లే.. అయితే అదే వారం బ్రో రిలీజ్ కు రెడీ అయ్యింది. జూలై 27 న బ్రో రిలీజ్ కానుంది.

Vikram: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరో విక్రమ్.. మరీ ఇంత దారుణంగానా

పవన్ కళ్యాణ్, తేజ్ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే. పవన్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీమేక్ అయినా కూడా పవన్- తేజ్ కాంబో కాబట్టి ఫ్యాన్స్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ముందు వారం రోజులు హత్య కలక్షన్స్ రాబడితే సరే.. లేకపోతే బ్రో తరువాత ఆ కలక్షన్స్ వస్తాయా.. రావా అనేది తెలియాల్సి ఉంది. పవన్ సినిమాకు ముందు తన సినిమాను రిలీజ్ చేసి విజయ్ ఏమైనా రిస్క్ చేస్తున్నాడా.. ? లేక కథ మీద ఉన్న దైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది.మరి పవన్ తో పోటీ.. విజయ్ కు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.

Show comments