NTV Telugu Site icon

Vijay Antony: ఏఆర్ రెహమాన్ వివాదం.. యూట్యూబ్ ఛానెల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బిచ్చగాడు

Youtube

Youtube

Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ సినిమా తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక విజయ్ ఆంటోని.. కేవలం హీరో మాత్రమే కాకుండా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ ఎంతటి వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియంలో సీట్లు లేకపోయినా టికెట్స్ డబ్బులు తీసుకొని లోపలి రానివ్వలేదని, ఆ కన్సర్ట్ లో చాలామంది అభిమానులపై రూడ్ గా బిహేవ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఏఆర్ రెహమాన్.. ఈ విషయంపై ఇప్పటికే స్పందించాడు. ఈ వివాదం వలన ఎవరైతే బాధపడ్డారో వారికి క్షమించమని అడుగుతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా వారి డబ్బును వెనక్కి పంపించేస్తాను అని కూడా తెలిపాడు.

Detective Teekshana Trailer: ఉపేంద్ర భార్య నటవిశ్వరూపం.. డిటెక్టివ్ గా అదరగొట్టింది

ఇక ఈ వివాదంలో విజయ్ ఆంటోని కూడా ఉన్నాడని మార్స్ తమిళనాడు అనే యూట్యూబ్ ఛానెల్ ఒక వీడియో పెట్టింది. ఆ కన్సర్ట్ కు సంబంధించిన వివాదంలో విజయ్ ఆంటోనీకి కూడా సంబంధం ఉందని రీతూ అనే అమ్మాయి వీడియో పెట్టడంత .. అది కాస్తా వైరల్ గా మారింది. ఇక ఈ వివాదంపై విజయ్ ఆంటోనీ ఫైర్ అయ్యాడు. ఆ యూట్యూబ్ ఛానెల్ పై లీగల్ గా వెళ్తున్నట్లు ప్రకటించాడు. ఆ ఛానెల్ పై పరువునష్టం దావా వేస్తున్నట్లు.. దానిమీద వచ్చే డబ్బును సంగీత పరిశ్రమలో డబ్బు అవసరం ఉన్న తన స్నేహితులకు ఇస్తాను అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో వైరల్ గా మారింది. విజయ్ ఆంటోనీ మంచి పని చేస్తున్నాడని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.