NTV Telugu Site icon

Vijay Antony: ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు బ్రో

Vijay

Vijay

Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఈ మధ్యనే ఘోర బోటు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. బిచ్చగాడు 2 సినిమా కోసం మలేషియాలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని వారం క్రితమే హాస్పిటల్ లో ఉన్న ఫోటోను షేర్ చేసి అభిమానులను ఆందోళన పడవద్దని చెప్పుకొచ్చాడు విజయ్. ఇక తాజాగా మరో ట్వీట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను కోలుకోనున్నాని చెప్పడంతో పాటు ఈరోజే బిచ్చగాడు 2 షూటింగ్ లో పాల్గొంటున్నట్లు చెప్పాడు. ” నేను 90 శాతం కోలుకున్నాను. విరిగిన నా ముక్కు, దవడ ఎముకలు తిరిగి కట్టుకున్నాయి. నిజంగా నాకు తెలియడంలేదు.. గతంలో కంటే నేను ఇప్పుడు మీతో సంతోషంగా మాట్లాడుతున్నాను. ఈరోజే నుంచే బిచ్చగాడు 2 షూటింగ్ మొదలు పెడుతున్నాను. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. మీ ప్రేమకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇన్ డైరెక్ట్ కౌంటర్లు.. ఎవరికో కొంచెం చెప్పండయ్యా

ఇక ఈ ట్వీట్ పై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక విజయ్ కోలుకోవాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. దేవుడి దయవలన ఆయన బతికిబయటపడ్డాడు. ఇంకా పూర్తిగా కోలుకోకుండా.. అప్పుడే షూటింగ్ అని వెళ్లడం ఎందుకు.. ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు గా అంటూ తమ ప్రేమను.. కోపంగా చూపిస్తున్నారు. ఇంకొందరు సినిమాపై పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు బ్రో.. ఆరోగ్యం కన్నా సినిమా పూర్తి చేయడమే ముఖ్యమా..? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సినిమా చేసుకోవచ్చు. కానీ, ఆరోగ్యం అలా కాదుగా.. రెస్ట్ తీసుకో బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్న విజయ్.. బిచ్చగాడు 2 తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments