Gaami: ‘గామి’ అంటే అదే.. దాని కోసం ఎంతవరకైనా వెళ్ళాలి: డైరెక్టర్ విద్యాధర్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidyadhar Kagita Interview for Gaami Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్. వి సెల్యులాయిడ్స్ ప్రజెంట్ చేస్తోన్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విద్యాధర్ కాగిత విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలు పంచుకున్నారు.
‘గామి’ అలా స్టార్ట్ అయ్యింది
ఓ సంఘటన నన్ను చాలా ఎక్సయిట్ చేసింది. ఆ ఐడియాని రాసి పెట్టుకున్నా, నాకు హిమాలయాల పర్వాతాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలిసి ఒక ఆలోచనగా మారాయి. మనకు దొరికిన బడ్జెట్ లో చేద్దామనే ఆలోచనతో మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం, దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమాని స్టార్ట్ చేశాం. తర్వాత డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు. అప్పుడే ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ రావడం జరిగింది.
Also Read
విశ్వక్ ఎంట్రీ
నటుల కోసం చూస్తున్నప్పుడు విశ్వక్ ని అనుకున్నాం. అప్పటికే తన సినిమాలు ఏమీ రాలేదు. రెగ్యులర్ ఆడిషన్ చేసి చాలా ఓపెన్ మైండ్ తో తను ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
ఇన్నేళ్ళ ప్రయాణంలో
మాకు ఒక అవుట్ పుట్ కావాలి, దాని కోసం ఎంతవరకైనా చేసుకుంటూ వెళ్లాం. అవతార్ ని కూడా పదేళ్ళు తీస్తారు, అయితే దాన్ని డీలే అని చెప్పం కదా. అది చేయాలంటే ఒక సమయం పడుతుంది. కొత్తగా చేస్తున్నామని భావించాం కాబట్టి సమయం పట్టింది అనే భావన రాలేదు. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా కొత్తగా ప్రయత్నించామని భావిస్తున్నాం.
ఇలాంటి ట్రావెలింగ్ కథని ప్రేక్షకులకు ఆసక్తిగా చెప్పడానికి ఎలాంటి ఎలిమెంట్స్ ని పొందుపరిచారు?
‘గామి’ సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా, డ్రామా చాలా అద్భుతంగా ఉంటుంది, అది ప్రేక్షకులను సినిమాలో లీనం చేస్తుంది.
గామి అంటే
గామి అంటే సీకర్, గమ్యాన్ని చేరేవాడు. ఇందులో ప్రధాన పాత్రకు ఒక గమ్యం ఉంటుంది. దాన్ని ఎలా చేరాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!