NTV Telugu Site icon

Vidya Balan: ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే..

Vidya Balan Casting Couch

Vidya Balan Casting Couch

Vidya Balan Talks About Her Casting Couch Experience: సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ‘మీటూ ఉద్యమం’ తర్వాతి నుంచే ఆ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్యమం సమయంలో ఎందరో భామలు చిత్రసీమలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ నటీమణులు కూడా ఓపెన్ అయ్యారు. కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని పంచుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా విద్యాబాలన్ కూడా.. కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఒక దర్శకుడు తనని కాఫీకి పిలిచి, రూమ్‌కి రమ్మన్నాడని కుండబద్దలు కొట్టింది. అతని పిలుపుతో తాను రూమ్‌కి వెళ్లానని, అయితే చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ డైరెక్టర్ మౌనంగా వెళ్లిపోయాడని తెలిపింది.

Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్

విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని నేను చెప్పాను. అయితే.. ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి వెళ్లి, మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడే అతని ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. దీంతో.. గదిలోకి వెళ్లిన తర్వాత నేను డోర్ లాక్ చేయకుండా, కొంచెం తెరిచి ఉంచాను. అది గమనించిన ఆ దర్శకుడు.. ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ టైంలో నేను తెలివి ప్రదర్శించడం వల్లే తప్పించుకోగలిగాను. ఇప్పటికీ నేను ఆ సంఘటనని మర్చిపోలేకపోతున్నా. ఇదొక్కటే కాదు.. ఇలాంటి సంగఘనలు ఎన్నో ఎదుర్కొన్నా. వాటి వల్ల మానసికంగా ఇబ్బందులు పడ్డాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలాకాలం కష్టపడాల్సి వచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది.

Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం

అయితే.. తాను సహకరించకపోవడం వల్ల ఆ దర్శకుడు తనని ఆ యాడ్ ఫిల్మ్ నుంచి తొలగించాడని విద్యాబాలన్ పేర్కొంది. అంతేకాదు.. బాడీ షేమింగ్ కూడా చేశారని వాపోయింది. దాంతో తాను చాలా బాధపడ్డానని, తిరిగి కోలుకోవడం కోసం కొంత సమయం పట్టిందని తెలిపింది. తాను ట్యాలెంట్‌ని నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని, ఆ ప్రతిభతోనే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగానని వెల్లడించింది. కాగా.. 2005లో ‘పరిణీత’ సినిమాతో ఈ భామ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడం కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడింది. చివరికి.. 2011లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆ సంవత్సరంలో తాను చేసిన ‘డర్టీ పిక్చర్’ సినిమా.. విద్యాబాలన్‌కి ఎనలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది.

Show comments