Venky 75: వెంకీ మామ గన్ పట్టుకోని వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో దగ్గుబాటి వెంకటేష్. మల్టీస్టారర్ సినిమాలు, F2, F3, వెంకీ మామ లాంటి కామెడీ సినిమాలు చేస్తున్న వెంకటేష్ లోపల గణేష్, ఘర్షణ, జయం మనదేరా లాంటి కమర్షియల్ సినిమాలని చేసిన మాస్ హీరో ఉన్నాడు. చాలా అరుదుగా మాస్ హీరోని బయటకి తీసే వెంకటేష్, తన 75వ సినిమాకి క్లాస్ నుంచి మాస్ వైపు వచ్చి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. శ్యాం సింగ రాయ్ లాంటి సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్, వెంకటేష్ 75వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ Here comes the BLAST of an Update, Extremely Proud & Privileged to announce that, Our Prestigious 𝑷𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒊𝒐𝒏 𝑵𝑶 2 is Victory @VenkyMama ’s Land Mark Film #Venky75 అంటూ ట్వీట్ చేశారు. జనవరి 25న వెంకీ 75కి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ బయటకి రానున్నాయి.
దగ్గుబాటి అభిమానులని ఖుషీ చేస్తున్న ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చెయ్యనున్నాడు. ‘HIT: ఫస్ట్ కేస్’, ‘HIT: సెకండ్ కేస్’ సినిమాలతో ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్నాడు అంటేనే ఒక ఘర్షణ రేంజ్ సినిమాని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లే వెంకీ 75 అనౌన్స్మెంట్ పోస్టర్ లో వెంకటేష్ గన్ పట్టుకోని నిలబడి ఉన్నాడు. పోస్టర్ లో ఉన్న ఇన్ఫ్రా రెడ్ లైన్స్ కూడా గమనిస్తే శైలేష్ కొలను, వెంకటేష్ తో కాప్ డ్రామా సినిమాని తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. శైలేష్ కొలను ఈ సినిమాని HIT ఫ్రాంచైజ్ లో కలుపుతాడా? లేక దీన్ని ఒక స్టాండ్ అలోన్ సినిమాగా రెడీ చేస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే జనవరి 25 వరకూ ఆగాల్సిందే.
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
Here comes the BLAST of an Update 🔥
Extremely Proud & Privileged to announce that, Our Prestigious 𝑷𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒊𝒐𝒏 𝑵𝑶 2 is Victory @VenkyMama’s Land Mark Film #Venky75 💥💥
Directed by @KolanuSailesh
Produced by @vboyanapalliAnnouncement on JAN 25th 2023❤️🔥 pic.twitter.com/EL3T4c78g8
— Niharika Entertainment (@NiharikaEnt) January 23, 2023
It's time for a new adventure🔥@KolanuSailesh @NiharikaEnt @vboyanapalli#Venky75 pic.twitter.com/qDvNX1f5XR
— Venkatesh Daggubati (@VenkyMama) January 23, 2023
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!