Site icon NTV Telugu

Venky 75: వెంకీ మామ గన్ పట్టుకోని వస్తున్నాడు…

Venky 75

Venky 75

విక్టరీ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో దగ్గుబాటి వెంకటేష్. మల్టీస్టారర్ సినిమాలు, F2, F3, వెంకీ మామ లాంటి కామెడీ సినిమాలు చేస్తున్న వెంకటేష్ లోపల గణేష్, ఘర్షణ, జయం మనదేరా లాంటి కమర్షియల్ సినిమాలని చేసిన మాస్ హీరో ఉన్నాడు. చాలా అరుదుగా మాస్ హీరోని బయటకి తీసే వెంకటేష్, తన 75వ సినిమాకి క్లాస్ నుంచి మాస్ వైపు వచ్చి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. శ్యాం సింగ రాయ్ లాంటి సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్, వెంకటేష్ 75వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ Here comes the BLAST of an Update,  Extremely Proud & Privileged to announce that, Our Prestigious 𝑷𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒊𝒐𝒏 𝑵𝑶 2 is Victory @VenkyMama ’s Land Mark Film #Venky75 అంటూ ట్వీట్ చేశారు. జనవరి 25న వెంకీ 75కి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ బయటకి రానున్నాయి.

దగ్గుబాటి అభిమానులని ఖుషీ చేస్తున్న ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చెయ్యనున్నాడు. ‘HIT: ఫస్ట్ కేస్’, ‘HIT: సెకండ్ కేస్’ సినిమాలతో ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్నాడు అంటేనే ఒక ఘర్షణ రేంజ్ సినిమాని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లే వెంకీ 75 అనౌన్స్మెంట్ పోస్టర్ లో వెంకటేష్ గన్ పట్టుకోని నిలబడి ఉన్నాడు. పోస్టర్ లో ఉన్న ఇన్ఫ్రా రెడ్ లైన్స్ కూడా గమనిస్తే శైలేష్ కొలను, వెంకటేష్ తో కాప్ డ్రామా సినిమాని తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. శైలేష్ కొలను ఈ సినిమాని HIT ఫ్రాంచైజ్ లో కలుపుతాడా? లేక దీన్ని ఒక స్టాండ్ అలోన్ సినిమాగా రెడీ చేస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే జనవరి 25 వరకూ ఆగాల్సిందే.

Exit mobile version