Madan Babu : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, కమెడియన్ మదన్ బాబు(71) కన్నుమూశారు. చాలా కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తమిళంలో ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి స్టార్ యాక్టర్ గా ఎదిగారు మదన్ బాబు. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలం పాటు దానికి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఆ మధ్య ఆరోగ్యం కుదుట పడినా.. రీసెంట్ గా మళ్లీ తిరగబడింది.
Read Also : Coolie Trailer : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది
దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన.. శనివారం కన్నుమూశారు. మదన్ బాబు అసలు పేరు ఎస్.కృష్ణమూర్తి. ఆయన మొదట్లో టీవీ షోలలో కనిపించేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ లాంటి సినిమాల్లో నటించారు. తమిళంలో మంచి గుర్తింపు సాధించుకున్న ఆయన.. వయసు రీత్యా చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Also : War 2 Vs Coolie : వార్-2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ బాగుందంటే..?