Venu Swamy: హీరోయిన్ తో వేణుస్వామి పూజ.. డైరెక్ట్ గా వైన్ బాటిల్ పెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. ఒక్క సమంత విషయంలో ఈయన చెప్పింది జరగడంతో.. మిగతా అన్ని విషయాల్లో జరుగుతుందని కొంతమంది నమ్ముతూ వచ్చారు. హీరోయిన్లు సైతం ఆయన చెప్పే పూజలు చేస్తే కెరీర్ లో ముందుకు వెళ్లొచ్చని, అవకాశాలు బాగా వస్తాయని నమ్ముతున్నారు. రష్మిక దగ్గరనుంచి అషు రెడ్డి వరకు అందరూ.. వేణుస్వామి క్లయింట్లే. ఇక తాజాగా డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది. అయితే మొదటి నుంచి ఆమెతో వేణుస్వామి పూజలు చేయిస్తునే వస్తున్నాడు .. కానీ, ఈసారి పూజలో వైన్ బాటిల్స్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఏం పూజ రా ఇది..వైన్ బాటిల్స్ పెట్టారు అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఇక ఇలా లిక్కర్ తో పూజ జరిపించడంపై వేణుస్వామి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. ఇదో రకం పూజ అని, ఇందులో తీర్థం మంచి నీళ్లతో ఉండదని, అందులో లిక్కర్ కలిపే ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ లిక్కర్ తాగితే.. దాన్నే పూజలో పెడతాను అని, లిక్కర్ తాగకపోతే, కూల్ డ్రింక్ పెడతాను అని చెప్పాడు. ” నా దగ్గరకు ఎవరైతే పూజలు కోసం వస్తారో.. ఇప్పుడు ఉదాహరణకు మీరు పూజ చేస్తే నీళ్లు తీర్థం పోసి ఇస్తారు కదా.. నేను చేసే పూజలో వాటర్ లో లిక్కర్ కలిపి ఇస్తా. ప్రతి పూజలో లిక్కర్ ఉంటుంది. నేను చేసే వామచార పూజలు..బాగాలమ్మకు,రాజ శ్యామల, తార, చిన్నమస్త.. ప్రతి పూజకు నేను లిక్కర్ పెడతా.. నాన్ వెజ్ పెడతా. నేను ఇచ్చే ప్రసాదం కూడా లిక్కరే ఇస్తా. డైరెక్ట్ అఫిషియల్ గా పెడతా.. నేనేం దొంగచాటుగా పెట్టను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు విన్న తరువాత డింపుల్ వైన్ తాగుతుంది కాబట్టి వైన్ బాటిల్స్ తో పూజ చేయించాడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ పూజా ఫలితం డింపుల్ కు ఎలా కలిసి వస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!