Vennela Kishore : వెన్నెల కిషోర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తాజాగా యాన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ కొట్టింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. ఆయన కామెడీపై మంచి ప్రశంసలు వస్తున్నాయి. దీంతో తాజాగా యన విలేకరులతో అనేక విషయాలపై స్పందించారు. ‘నేను కామెడీ చేయగలను అని మొదట్లో అనుకోలేదు. కానీ కాలమే నన్ను ఇటువైపు నడిపించింది. బ్రహ్మానందం గారిని చూసి చాలా ఇన్ స్పైర్ అయ్యాను. కానీ ఆయనలా నటించడం సాధ్యం కాదు. ఎలాంటి సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలనేది ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో అనిపిస్తుంది. నేను నా కెరీర్ లో ఎన్నో పాత్రల్లో నటించాను. కానీ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన దూకుడు సినిమాతోనే నా డ్రీమ్ పాత్ర తీరిపోయింది.
Read Also : Raj Tarun: తమిళ్ ‘గోలీసోడా’ కొట్టేందుకు రెడీ అయిన రాజ్ తరుణ్
ఆయన పక్కన అలాంటి బలమైన పాత్ర చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. అది దూకుడుతో తీరిపోయింది. ఈ రోజుల్లో కామెడీ చేయడం ఒక పెద్ద సవాల్. ఎందుకంటే అన్ని స్టేజిల మీద కామెడీ దొరుకుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అక్కడే కామెడీ షార్ట్ టైమ్ వీడియోల్లో దొరుకుతోంది. అందుకే సినిమాల్లో అంతకు మించి కామెడీ ఉండాలని ట్రై చేస్తున్నాం. దాని కోసం ఎన్నో రకాల పాత్రలను సృష్టించాలి. ఈ విషయంలో రచయితలను మనం చాలా ప్రోత్సహించాలి. వారికి ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి. అప్పుడే మంచి పాత్రలు వస్తాయేమో అనిపిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు వెన్నెల కిషోర్.
Read Also : Samantha : నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు : సమంత
