Site icon NTV Telugu

Koratala Siva : వెంకీమామ – కొరటాల శివ.. ప్లానింగ్

Koratala Siva

Koratala Siva

మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్  హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్  బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో  హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి సారిగా కలిసి నటించిన ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

Also Read : Bollywood : డిజాస్టర్ దర్శకుడితో రూ. 500 కోట్ల హీరో..

 అయినా సరే కొరటాలను నమ్మి అవకాశం ఇచ్చాడు తారక్. ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడు కొరటాల. దేవరతో రూ. 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇచ్చాడు శివ. ప్రస్తుతం దేవర 2 పై వర్క్ చేస్తున్నాడు. అయితే దేవర తర్వాత కొరటాల శివ చిత్రం ఏంటి అనే డిస్కషన్ నడుస్తోంది. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మేరకు కొరటాల నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సంక్రాంతి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్  అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే వెంకీకి సరిపడా కొరటాల శివ ఓ కథ రెడీ చేసాడట. వెంకీకి కథ వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టేనని సమాచారం. గతంలో వెంకీ నటించిన తులసి సినిమాకు కొరటాల శివ కథ అందించాడు. కానీ ఈ లోగా దేవర 2 ఫినిష్ అవ్వాలి.

Exit mobile version