Venky Comedian Ramachandra : ఈ మధ్య చాలా మంది నటులు మంచాన పడుతున్నారు. రీసెంట్ గానే ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఇప్పుడు మరో నటుడు మంచాన పడ్డాడు. రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమా ఇప్పటికీ ఫేమస్. ఆ సినిమాలో వెంకీ పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బొద్దుగా ఉండే వ్యక్తి రమణ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అతను అప్పట్లో చాలా ఫేమస్. అతని అసలు పేరు రామచంద్ర. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పుడు అవకాశాలు లేక వేరే పనులు చేసుకుంటున్నాడు. తాజాగా అతను మంచం మీద నుంచి నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనకు పక్షవాతం వచ్చింది. దీంతో ఆయనకు రెండు కాళ్లు సరిగ్గా నడవరావట్లేదు. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also : TVK Chief Vijay : స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న టీవీకే చీఫ్ విజయ్
కమెడియన్ రామచంద్రం సొంతం, దుబాయ్ శ్రీను, సొంతం లాంటి సినిమాలతో మంచి ఫేమస్ అయ్యాడు. ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు ఇలా ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. 15 రోజుల క్రితం నేను ఓ షూటింగ్ కోసం వెళ్లాను. తర్వాత భోజనం చేసేటప్పుడు సడెన్ గా కాళ్లు నొప్పి పెట్టాయి. ఏంటా అని డాక్టర్ల వద్దకు వెళితే బ్రెయిన్ లో రెండు బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టు చెప్పారు. దీంతో నా ఎడమ చేయి, కాలు పడిపోయాయి. ప్రజెంట్ మెడిసిన్ వాడుతున్నాను. రెండు నెలల పాటు మంచం మీదే రెస్ట్ తీసుకోవాలని తెలిపారు. దీనికి లాంగ్ కోర్సు వాడాలంటున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. నా బ్రదర్ అన్నీ చూసుకుంటున్నాడు. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ విషయం తెలిస్తే నాకు సహాయంగా ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు రామచంద్ర. ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Nara Rohith : నా ఇంటిపేరుతోనే జనాలకు సమస్య.. నారా రోహిత్ కామెంట్స్
