Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఇటీవల రావ్ బహదూర్ తో దర్శకుడిగా ప్లాప్ అందుకున్నాడు. సినిమా బాగుంది అనే కామెంట్స్ వచ్చాయి కానీ వసూళ్లు మాత్రం రాలేదు. దాంతో ఈసారి రూటుమార్చి కమర్షియల్ పంథాలోకి వచ్చాడు. తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’ పుట్టిన విశాఖపట్నం నేల నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ కొత్త చిత్రానికి ‘అట్టహాసం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. రూటెడ్ హ్యూమన్ ఎంటర్టైనర్ ‘అట్టహాసం’ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలను మేకర్స్ వెల్లడించారు.
ఈ చిత్రంలో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం, ‘పుష్ప’ ఫేమ్ పావని కరణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు దర్శకుడు వెంకటేశ్ మహా స్వయంగా నటిస్తుండగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్రవంతి పెపకాయల కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తుండగా, స్మరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సహజమైన భావోద్వేగాల ప్రయాణాన్ని సమ్మర్ 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ అందించిన అనుభూతిని ఈ సినిమా కూడా ప్రతిబింబిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగాలతో కాస్త నిరాశచెందిన వెంకటేష్ మహా ఈ సారి ఎలాగైన కమర్షియల్ సక్సెస్ కొట్టాలని అట్టహాసంగా వస్తున్నాడు. మరి ఈ సినిమా ఈ దర్శకుడికి కమర్షియల్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు