Site icon NTV Telugu

Venkatesh Maha: కెజిఎఫ్ బాగాలేదు అన్న డైరెక్టర్.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను

Kgf

Kgf

Venkatesh Maha: కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామీ మామూలుది కాదని చెప్పాలి. ఇప్పటికీ జీవితంలో ఎవరైనా డిప్రెషన్ గా ఉన్నారు అంటే దైర్యం తెచ్చుకోవడానికి ఈ సినిమాలోని ఆశా పాశం సాంగ్ వింటూ ఉంటారు. అంతలా ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం తరువాత వెంకటేష్ మహా.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో వచ్చాడు. ఈ మధ్యనే మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాను నిర్మించాడు. ఇక్కడ వరకు ఉంటే వెంకటేష్ మహాపై అందరికి పాజిటివ్ గానే ఉండేది. కానీ ఈ డైరెక్టర్ అనుకోకుండా కాకుండా అనుకొనే నోరు జారాడు. డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో వెంకటేష్ మహా.. కెజిఎఫ్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అప్పటినుంచి ఈ డైరెక్టర్ మీద చాలామంది అభిమానులకు నెగెటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. ఈ డైరెక్టర్ ఏది మాట్లాడినా అప్పటి కామెంట్స్ తో పోలుస్తూ మాట్లాడుతున్నారు.

తాజాగా వెంకటేష్ మహా.. హాయ్ నాన్న సినిమాపై రివ్యూ ఇచ్చాడు. ఇక ఈ రివ్యూపై ఒక నెటిజన్.. రెండు సినిమాలు తీసి కెజిఎఫ్ పై సెటైర్లు వేసింది నువ్వేగా అంటూ విమర్శించాడు. దానికి వెంకటేష్ మహా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ” వదిలేస్తే మాట వినరు గా మీరు. సరే చెబుతున్నా వినండి ఎన్ని సినిమాలు తీశామనేది కాదు ముఖ్యం ఏం సినిమా తీశాం అనేది ముఖ్యం. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేశాను ఇంకా మరిన్ని చేస్తాను. ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చి గా మాట్లాడితే, ఇంకా ఊరుకోను.. నిజమైన వ్యక్తులకు: అవసరమైతే వ్యక్తిగతంగానూ, న్యాయపరంగానూ ఈ బెదిరింపుపై పోరాడతాను. ఈ ముఖం లేని రౌడీలను మూసివేయడానికి నాకు మద్దతు ఇవ్వాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ రచ్చ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version