Venkatesh Maha: యోగిబాబు పోలిన నటుడి కోసం వెతకలేదు.. అందుకే సంపూని ఎంచుకున్నాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh Maha Exclusive Interview about Martin Luther King Movie: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి “మార్టిన్ లూథర్ కింగ్” అనే సినిమాను సమర్పిస్తున్నాయి. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం నాడు విలేకర్లతో ముచ్చటించిన వెంకటేష్ మహా ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ పాత్రను సంపూర్ణేష్ తో చేపించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
వెంకటేష్ మహా: మొదట వై నాట్ స్టూడియోస్ నుంచి ఈ సినిమా డైరెక్ట్ చేయమని నాకు ఫోన్ వచ్చింది కానీ అప్పటికే నా దగ్గర ఒరిజినల్ కథలు చాలా ఉన్నాయి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా అప్పుడు కాస్త ఖాళీ టైం ఉండటంతో చేశా కానీ ఈ సినిమా నేను చేయలేనని చెప్పా. అయినా ఒకసారి సినిమా చూడమంటే చూశా, చూశాక అర్థమైంది ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన కథ అని. ప్రజాస్వామ్యం ఎన్ని దేశాల్లో ఉంటే అన్ని దేశాల్లో చూపించాల్సిన సినిమా, అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ అందుకే ఆ తర్వాత పూజని దర్శకురాలు అనుకున్నాం. సుధ కొంగర లాంటి వారితో సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి పూజ ఎంపిక పట్ల వైనాట్ స్టూడియోస్ చాలా హ్యాపీ. అయితే ఈ పాత్రకి ఏ నటుడిని తీసుకోవాలి అనేదే అసలైన చిక్కు వచ్చిపడింది. వైనాట్ స్టూడియోస్ శశి 20 రోజుల్లో వస్తాం అంటే ఆయన వచ్చేప్పటికి మేము పీపీటీ రెడీ చేసి, తెలుగుకి తగ్గట్టుగా ఎలా తీయబోతున్నాం అనేది ఆయనకు వివరించాలి అయితే అన్నీ సిద్ధమయ్యాయి కానీ నటుడి ఎంపిక జరగలేదు. రూపురేఖల్లో యోగిబాబులా ఉండే నటుడి కోసం మేం వెతకలేదు ఎందుకంటే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆ పాత్రకి సరిపోయే నటుడి కోసం వెతికాం. 19 రోజులు గడిచాయి. రేపే శశికి అన్నీ వివరాలు చెప్పాలి అనుకుంటూ ఉన్నా. ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఓ 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకొని ఆలోచించడం నాకు అలవాటు, అలా అప్పుడు సడెన్ గా సంపూర్ణేష్ గుర్తుకొచ్చారు. వెంటనే సంపూ లైఫ్ స్టైల్ గురించి ఒక డాక్యుమెంటరీ చూశాం, ఆయన తెర మీద ఆ పాత్రలో కనిపిస్తే ఒక సగటు మనిషి వచ్చాడురా అనే భావన చూసే ప్రేక్షకులకు కలుగుతుంది అన్నా ఆ తర్వాత ఆయనతో మాట్లాడటం, ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరించడం జరిగిపోయాయి.
Also Read
ఈ సినిమాలో మీరు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఆ ఆలోచన ఎవరిది?
వెంకటేష్ మహా: ఈ పాత్ర మీరు చేస్తే బాగుంటుందని మొదట పూజ అన్నారు. అప్పటికి నేను అంటే సుందరానికీ వంటి కొన్ని సినిమాలు చేయడం ఆమె చూసి మీరు ఈ పాత్ర చేస్తే బాగుంటుంది అన్నారు. కానీ నాకు ఎవరైనా వేరే మంచి నటుడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనిపిం ఆడిషన్స్ చేశాం. ఎంతో ప్రతిభగల ఒక నటుడిని ఎంపిక చేశాం కానీ మా సినిమా మొదలయ్యే సమయానికి ఆయన ఒక పెద్ద సినిమాలో పాత్ర కోసం డేట్లు ఇవ్వడంతో రాలేకపోయారు. ఇంకో 10-15 రోజుల్లో షూటింగ్ కి వెళ్తాం అనగా నరేష్ కూడా ఈ పాత్ర మీరు చేయాలని అన్నారు, అయితే ఆ నటుడి డేట్స్ కుదరకపోవడం వల్ల అలా నేను ఈ పాత్ర చేయాల్సి వచ్చింది.
ఈ సినిమాకి డైరెక్టర్ గా పూజని ఎంచుకోవడానికి కారణం?
వెంకటేష్ మహా: తెలుగుకి తగ్గట్టుగా రచన పరంగా నేను మార్పులు తీసుకు వస్తాను కానీ కొత్త డైరెక్టర్ అయితే సినిమాకి కొత్తదనం వస్తుంది అనిపించి శశితో చెప్పాను. నేను నిర్మాణ భాగస్వామిగా, రచయితగా వ్యవహరిస్తా, డైరెక్టర్ ఎంపిక కోసం మాత్రం కాస్త సమయం కావాలని అన్నాను. అలా ఆయనతో ఫోన్ మాట్లాడి పెట్టేశా, అప్పుడు నా ఎదురుగా పూజ ఉన్నారు. నేను ఈ సినిమా డైరెక్ట్ చేస్తా అన్నారు, ఆమె అసోసియేట్ గా నా టీమ్ లో పని చేశారు. నేను అప్పుడు ఆమెనిమీరే ఎందుకు డైరెక్ట్ చేయాలని? ఒక్కటే ప్రశ్న అడిగా నన్ను ఇండస్ట్రీలో చాలామంది నేను చెప్పాలనుకుంటున్న కథలు కాకుండా ఆ కథలు తీయి, ఈ కథలు తీయి అంటూ నా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారని అన్నది. ఈ సినిమాలో హీరో పాత్రకి తన ఐడెంటిటీ తెలియదు, చివరికి తన ఐడెంటిటీ చాటుకుంటాడు. మీ అందరి కంటే కూడా ఆ పాత్ర నేనే బాగా అర్థం చేసుకోగలను అని ఆమె చెప్పారు, ఆ తర్వాత నేను శశితో మాట్లాడా, మేము సుధ కొంగర, పుష్కర్ గాయత్రి వంటి వారితో పనిచేశాం మాకు ఎలాంటి సమస్య లేదు, సంతోషమే అన్నారు. అలా పూజ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా విషయంలో నేను తీసుకున్న నిర్ణయాలలో సంపూర్ణేష్ ని నటింపచేయాలి అనుకోవడం, పూజ ని డైరెక్టర్ గా తీసుకోవడం ఉత్తమమైనవి.
ఎన్నికల వేడి మొదలైన సమయంలో సినిమా విడుదలవుతుంది.. ముందుగానే ప్లాన్ చేశారా?
వెంకటేష్ మహా: లేదండీ, అలా కుదిరింది నిజానికి ఫిబ్రవరికి ఈ సినిమా రెడీ అయింది మే లోనే విడుదల చేయాలి అనుకున్నా కానీ ఆ సమయంలో చాలా సినిమాల విడుదల ఉండటంతో కుదరలేదు. ఇప్పటికి కుదిరింది, అయితే ఇప్పుడే ఎన్నికలు హడావుడి మొదలవ్వడం అనేది అనుకోకుండా జరిగింది.
సినిమా చూశాక ప్రేక్షకులు ఎవరిని కింగ్ అని భావిస్తారు?
వెంకటేష్ మహా: ప్రేక్షకులు తమని తాము కింగ్ లా ఫీలయ్యి థియేటర్ల నుంచి బయటకు వస్తారు, టీమ్ పరంగా చెప్పాలంటే సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ కింగే.
దర్శకుడిగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి?
వెంకటేష్ మహా: రెండు మూడు కథలు రాసుకుని ఎందరికో చెప్పా, చాలామందికి నచ్చాయి కానీ కార్యరూపం దాల్చలేదు. దానికి పలు కారణాలు ఉన్నాయి అయితే ప్రధాన కారణం నేను అనుకున్న మూల కథను మార్చేలా మార్పులు చెప్పడం. అసలు మూల కథ మార్చేస్తే ఇంకేం ఉంటుంది, అందుకే దాన్ని మార్చడానికి నా మనసు ఒప్పలేదు. కాస్త ఆలస్యమైనా ప్రస్తుతం మర్మాణువు అనే ఓ మంచి సినిమాని రూపొందిస్తున్నా, ఒక జానర్ కి పరిమితం కాకుండా విభిన్న సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం, ఆ దిశగానే నా అడుగులు పడుతున్నాయి.
ఇప్పటిదాకా సంపూ గారు చేసిన పాత్రలు, సినిమాలు వేరు. ఆ ఇమేజ్ కి భిన్నంగా ఈ పాత్ర చేయించడం ఛాలెంజింగ్ గా అనిపించలేదా?
వెంకటేష్ మహా: ఆయన కూడా పాత్రకి తగ్గట్టుగా తనని తాను మలుచుకొని ఎంతో సహకరించారు. వర్క్ షాప్స్ లో కూడా పాల్గొన్నారు. దాదాపు ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ ముందుగానే రిహార్సల్స్ చేశారు. డైరెక్టర్ గారు కొత్త టెక్నిక్స్ తో వర్క్ షాప్స్ చేశారు. షూటింగ్ మొదలయ్యాక సెట్స్ లో సంపూ గారికి, డైరెక్టర్ గారికి మధ్య సింక్ చూసి ఆశ్చర్యమేసేది. వాళ్ళు వర్క్ షాప్స్ లో అంతలా ట్రైన్ అయ్యారు.
తాజావార్తలు
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!